తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణి వద్దు, సీఏఆర్​డీ ముద్దు: డాక్యుమెంట్ రైటర్లు - protest against dharani

కొత్త పద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేపట్టడంతో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని డాక్యుమెంట్ రైటర్లు నిరసనకు దిగారు. పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్​ చేశారు. డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేకుండానే వినియోగదారులకు పూర్తిగా సులభంగా ఉంటుందని సబ్ రిజిస్ట్రార్ జ్యోతి స్పష్టం చేశారు.

Document writers protest to continue the old method of registration
ధరణి వద్దు, సీఏఆర్​డీ ముద్దు: డాక్యుమెంట్ రైటర్లు

By

Published : Dec 14, 2020, 4:06 PM IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం కావడంతో మేడ్చల్ జిల్లా సూరారం సబ్​రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారని.. అందువల్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. పాత పద్ధతినే కొనసాగించాలని నిరసన చేపట్టారు. 'ధరణి వద్దు, సీఏఆర్​డీ ముద్దు' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

"కొత్త పద్ధతి ద్వారా ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేకుండానే పూర్తిగా వినియోగదారులకు సులభంగా ఉంది. ప్రస్తుతం సేల్, గిఫ్ట్, మార్టగేజ్.. ఈ మూడు సర్వీస్​లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అతి త్వరలో పూర్తిసేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త పద్ధతి ద్వారా తప్పనిసరిగా పీటీఎన్ నంబర్ ఉంటేనే స్లాట్ బుక్ అవుతుంది."

-జ్యోతి, సబ్ రిజిస్ట్రార్

ఇదీ చూడండి: 'ఆమె ఓడిపోయినా... ఇంటింటికెళ్లి సమస్యలు తెలుసుకుంది'

ABOUT THE AUTHOR

...view details