మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డీకే అరుణ హాజరయ్యారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొరారు. భాజపా సభ్యత నమోదు కార్యక్రమాన్ని నియోజకవర్గం, డివిజన్, బూత్ స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలి : డీకే అరుణ - భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం కుత్బుల్లాపూర్
గ్రామ, పట్టణ స్థాయిలో భాజపా సభ్యత్వ నమోదులో దూసుకుపోవాలని మాజీమంత్రి డీకే అరుణ పేర్కొన్నారు.

బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలి : డీకే. అరుణ