కరోనాను నివారించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా తమ వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసి వేసి.. ఇళ్లలోనే ఉంటున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులూ మూతబడ్డాయి.
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి, ఉప్పల్, ఘట్కేసర్, రామంతాపూర్, మేడిపల్లి, బోడుప్పల్‌లోని రోడ్లన్నీ ప్రయాణికులు లేక బోసిపోయాయి.
కూకట్‌పల్లిలో..
కూకట్‌పల్లిలోనూ జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఎవరూ రోడ్లపైకి రాకుండా ఇళ్లలోనే గడుపుతున్నారు. కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ సర్కిల్, మూసాపేట్, హైటెక్ సిటీ రహదారి తదితర ప్రాంతాలు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.