తెలంగాణ

telangana

ETV Bharat / state

DGP: అప్లై చేసిన వారందరికీ ఇవ్వడం కుదరదు: డీజీపీ

అడిగిన వాళ్లందరికిీ ఈ పాస్​లు ఇవ్వడం కుదరదని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పాసులు ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ వద్ద పోలీస్‌ చెక్‌పోస్టును ఆయన పరిశీలించారు.

DGP mahender reddy o
మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ వద్ద పోలీస్‌ చెక్‌పోస్టు వద్ద డీజీపీ తనిఖీలు

By

Published : May 27, 2021, 2:43 PM IST

Updated : May 27, 2021, 4:40 PM IST

ప్రజలెవరూ అనవరంగా రహదారులపైకి రాకుండా లాక్​డౌన్​కు సహకరించాలని డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ మహానగరంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం లాక్​డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కొన్నిచోట్ల యువకులు అకారణంగా బయటికి వస్తున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలిందని.. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని మహేందర్ రెడ్డి సూచించారు.

అత్యవసర సర్వీసులతో పాటు... ప్రభుత్వం మినహాయింపునిచ్చిన రంగాలకు చెందిన వాళ్లకు ఎలాంటి అనుమతి అవసరం లేదని.. నిర్ధరించిన సమయంలో ఆయా రంగాలకు చెందిన వాళ్లు పనులు చేసుకోవచ్చని మహేందర్ రెడ్డి తెలిపారు.

పాస్‌లు దుర్వినియోగం చేస్తే చర్యలు

ప్రజల సహకారంతోనే లాక్ డౌన్​ను కఠినంగా అమలు చేయడం సాధ్యమవుతోందని మహేందర్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ జంక్షన్ వద్ద ఉన్న పోలీసు తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ-పాస్‌లు దుర్వినియోగం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్స్‌లను కూడా పంపిస్తున్నామని తెలిపారు. డెలివరీ బాయ్స్‌ తమకు కల్పించిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.

డీజీపీ మహేందర్ రెడ్డి


ఇదీ చూడండి:JUDA's Strike: జూనియర్ వైద్యులతో ప్రభుత్వం చర్చలు ప్రారంభం

Last Updated : May 27, 2021, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details