తెలంగాణ

telangana

తెలంగాణ పచ్చదనానికి చిరునామా: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

తెలంగాణ పచ్చదనానికి చిరునామాగా మారిందని మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్​ రెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్​ జిల్లా కండ్లకోయలో అటవీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు.

By

Published : Nov 12, 2020, 5:58 PM IST

Published : Nov 12, 2020, 5:58 PM IST

Updated : Nov 12, 2020, 6:52 PM IST

dfo-office-inauguration-by-minister-malla-reddy-and-indrakaran-reddy-in-medchal-district
తెలంగాణ పచ్చదనానికి చిరునామా: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

మేడ్చల్​ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో ఏర్పాటు చేసిన జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి జిల్లా అధికారులు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెరాస ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో పచ్చదనం గణనీయంగా పెరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.

హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు అడవుల సంరక్షణకు పోలీసు అటవీశాఖ అధికారులతో కలిసి ఉమ్మడిగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా అడవులకోత 99 శాతం తగ్గిపోయిందన్నారు. ముప్పైఏండ్ల కిందటి పచ్చదనం కనిపిస్తుందన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత మేడ్చల్ జిల్లాలో మొట్టమొదటిగా అడవిశాఖ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అదే ఆవరణలో రూ.25 లక్షలతో అధికారులకు క్వార్టర్ల నిర్మాణాన్ని కుడా చేపడుతున్నామని తెలిపారు. కార్యాలయం ఆవరణలో మంత్రులు మొక్కలను నాటారు.

ఇదీ చూడండి:ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది: పొంగులేటి

Last Updated : Nov 12, 2020, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details