తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాంపేట్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: వివేక్​ - నిజాంపేట్​ పురపాలికలో వ్యాయామశాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ

నిజాంపేట్​ పురపాలికను మరింత అభివృద్ధి చేస్తామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్​ అన్నారు. పలు ప్రాంతాల్లో పూర్తైన సీసీ రోడ్లు, బహిరంగ వ్యాయామశాలను ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు, మేయర్​ నీలా గోపాల్​రెడ్డితో కలిసి ప్రారంభించారు.

development works inauguration by mla mlc in nizampet muncipal corporation
నిజాంపేట్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం : వివేక్​

By

Published : Dec 19, 2020, 3:56 PM IST

Updated : Dec 19, 2020, 7:44 PM IST

నిజాంపేట్​ పురపాలికలో పలు అభివృద్ధి పనులకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్​, ఎమ్మెల్సీ శంభీపూర్​ రాజు, మేయర్ నీలా​ గోపాల్​ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్​ ప్రాంతాల్లో పూర్తైన సీసీ రోడ్లు, బహిరంగ వ్యాయామశాలను ప్రారంభించారు.

దాదాపు రూ.5 కోట్ల రూపాయలతో నిజాంపేట్​ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు. మంత్రి కేటీఆర్​ సహకారంతో అభివృద్ధికి చిరునామాగా మార్చుతామని అన్నారు. పురపాలికలో జరిగే పనులపై ప్రతి శనివారం సమీక్ష నిర్వహించి, ముందుకు సాగుతామని వివేక్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:'జనవరి తొలివారం నుంచి ఉచిత తాగునీటి సరఫరా'

Last Updated : Dec 19, 2020, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details