తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్​కు సైబర్​ యుద్ధం పొంచి ఉంది : రాజ్​నాథ్ సింగ్ - defence minister rajnath singh at Dundigal Air Force Academy

స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. రఫేల్ రాకతో వాయుసేనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల ఏరివేతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు.

defence minister rajnath singh visited Dundigal Air Force Academy
దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

By

Published : Dec 19, 2020, 10:51 AM IST

Updated : Dec 19, 2020, 5:22 PM IST

భారత్‌ ఏ దేశంతోనూ సంఘర్షణ కోరుకోదని... శాంతి కోసమే ప్రయత్నిస్తుందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. భారత రక్షణ రంగంలో వాయుసేన సేవలు స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గవని పేర్కొన్నారు. 1971లో జరిగిన యుద్ధంలో వాయుసేన చూపిన పరాక్రమం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. జల, వాయు, భూమి యుద్ధమే కాకుండా సైబర్ యుద్ధం కూడా పొంచి ఉందని.... రాబోయే రోజుల్లో దీనికి మరింత సన్నద్ధం కావాలని రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు.

దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ పరేడ్ లో శిక్షణ పూర్తి చేసుకున్న 114 మంది వాయుసేన అధికారులు, ఆరుగురు నేవీ, ఐదుగురు కోస్టుగార్డు క్యాడెట్లు పాల్గొన్నారు. వారి నుంచి రాజ్ నాథ్ సింగ్ గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలు అందించారు. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌, వాయుసేన విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

భారత్​కు సైబర్​ యుద్ధం పొంచి ఉంది
Last Updated : Dec 19, 2020, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details