తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ శివారులో దారుణం.. కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం.. - కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం

కూతుళ్లను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే వారి పాలిట రాక్షసుడయ్యాడు. వావి వరస మరిచిపోయి కన్న కూతుళ్లపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌లో జరిగింది.

daughters raped by father
కూతుళ్లపై తండ్రి అఘాయిత్యం

By

Published : Feb 29, 2020, 5:41 PM IST

Updated : Feb 29, 2020, 6:04 PM IST

మేడ్చల్‌ జిల్లా దుండిగల్ కైసర్​నగర్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. కన్న కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ రాక్షస తండ్రి. పెద్ద కుమార్తె (14)పై గత సంవత్సరం కాలంగా తండ్రి అత్యాచారానికి పాల్పడేవాడు.

నిన్న రాత్రి తన చిన్న కుమార్తె(11)పై అత్యాచారానికి పాల్పడుతుండగా... తల్లి లేచి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. భర్తను భార్య నిలదీయగా భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించగా చిన్న కుమార్తె బయటకి వచ్చి చుట్టుపక్కల వారికి చెప్పగా... అందరు కలిసి ఆ దుర్మార్గుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి కుటుంబం ఏడాది క్రితం బిహార్ నుంచి వలస వచ్చి కైసర్​నగర్​లో ఉంటోంది.

ఇదీ చూడండి:ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ

Last Updated : Feb 29, 2020, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details