తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు - తెలంగాణ వార్తలు

ఇంటర్మీడియట్ అనంతరం ఏ కోర్సు చేయాలనే అంశంపై ఈనాడు, కేఎల్​హెచ్ యూనివర్సిటీ సంయుక్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కోర్సులపై విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ర్యాంకులు రాలేదని కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.

dasha-disha-program-by-eenadu-and-klh-university-at-bachupally-in-medchal-malkajgiri-district
ఈనాడు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు

By

Published : Mar 21, 2021, 1:08 PM IST

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు ఎలాంటి కోర్సులు అభ్యసించాలనే అంశాలపై ఈనాడు, కేఎల్​హెచ్​ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అవగాహన దశ-దిశ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాచుపల్లిలోని శ్రీ చైతన్య బాలికల కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. వైద్య విద్య, అనుబంధ విద్యా కోర్సులతో పాటు ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ వంటి కోర్సులపై అవగాహన కల్పించారు.

తల్లిదండ్రుల కలలను నిజం చేయాలంటే కష్టపడి ఇష్టంగా చదవాలని చైతన్య విద్యాసంస్థల ఏజీఎం రవి కుమార్ సూచించారు. ర్యాంకులు రావడం లేదని, అవకాశాలు లేవని కుంగిపోకుండా ముందుకు సాగాలని ధైర్యాన్ని నింపారు. వివిధ కోర్సులపై తమకున్న అపోహలు ఈ కార్యక్రమం ద్వారా తొలగిపోయాయని విద్యార్థులు తెలిపారు. అనంతరం పలువురు విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు.

ఇదీ చదవండి:దేశంలో మరో 43వేల కరోనా కేసులు​

ABOUT THE AUTHOR

...view details