మేడ్చల్ జిల్లా బాలానగర్ జోన్లోని పోలింగ్ కేంద్రాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. ముందుగా జీడిమెట్ల, సనత్నగర్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఆయన బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
కుత్బుల్లాపూర్ మండలంలోని గాంధీనగర్ జిల్లా పరిషత్ హైస్కూల్, ఠాగూర్ హైస్కూల్, అల్లాఉద్దీన్ కమ్యూనిటీ హాల్, సనత్నగర్, జీహెచ్ఎంసీ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేయనున్న పోలింగ్ స్టేషన్లను సందర్శించి సూచనలు చేశారు.