ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రుడు తమ బాధ్యతను నిర్వర్తించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌లో భాగంగా కూకట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.
ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి: సీపీ సజ్జనార్
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌లో భాగంగా కూకట్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి: సీపీ సజ్జనార్
ఓటు వేయడానికి వచ్చిన సీనియర్ సిటిజన్స్‌కి కుర్చీలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పట్టభద్రులు ఓటు వేసి ప్రజాస్వామ్యని గెలిపించాలని కోరారు. గత ఎన్నికల్లో 34 శాతం మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారని... ఈసారి ఓటింగ్ శాతం పెరగాలన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓటింగ్ సరళిపై సైబరాబాద్ సీపీ సజ్జనార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.