మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సీఎం కేసీఆర్ దత్తత మండలం ముడుచింతలపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పర్యటించారు. మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రారంభం విషయంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటు కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. మండలంలో ఇంకా ఏ కార్యక్రమాలు చేపట్టాలో పరిశీలించేందుకు వచ్చినట్లు వివరించారు.
సీఎం కేసీఆర్ దత్తత మండలంలో సీఎస్ సోమేశ్ పర్యటన - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
సీఎం కేసీఆర్ దత్తత మండలం ముడుచింతలపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులతో సమీక్ష జరిపారు.
సీఎం కేసీఆర్ దత్తత మండలంలో సీఎస్ సోమేశ్ పర్యటన
ముఖ్యమంత్రి దత్తత మండలమైన ముడుచింతలపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులతో సమీక్ష జరిపారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, సైబరాబాద్ సీపీ సజ్జనార్, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, అధికారులు ప్రజాప్రతినిధులు ఈ సందర్శనలో పాల్గొన్నారు.