ప్రభుత్వ భూమిలో ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేస్తూ... మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగద్గిరిగుట్ట డివిజన్లో ఒక్క బస్తీ దవాఖాన కూడా లేదని సీపీఐ నేతలు వాపోయారు. డివిజన్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇదే విషయమై సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్‌కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.
ప్రభుత్వ భూమిలో ఆసుపత్రి నిర్మించాలంటూ సీపీఐ నాయకుల ఆందోళన - CPI leaders protest in jagadgirigutta
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలోని ప్రభుత్వ భూమిలో ఆసుపత్రి నిర్మించాలని కోరుతూ సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వ భూమిలో ఆస్పత్రి నిర్మించాలంటూ సీపీఐ నాయకుల ఆందోళన
డివిజన్లో కుల, మతాలకు చెందిన భవనాలు వెలుస్తున్నాయే తప్ప... అందరికీ ఉపయోగపడే ఆసుపత్రి నిర్మించకపోవడం దారుణమని సీపీఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆ ప్రభుత్వ భూములు కబ్జా చేయకముందే ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ