రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. దిల్లీలో రైతులు 'చక్కా జామ్' పేరుతో రహదారుల దిగ్బంధం పిలుపుతో రాష్ట్రంలో పలు చోట్ల రైతులు నిరసనలు చేపట్టారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌లోని అల్వాల్ రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను బొల్లారం పీఎస్‌కు తరలించారు.
రైతులకు మద్దతుగా సీపీఐ రాస్తారోకో - ఆందోళనలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నాయకులు
దిల్లీలో రైతులు 'చక్కా జామ్' పేరుతో రహదారుల దిగ్బంధం పిలుపుతో రాష్ట్రంలో పలు చోట్ల రైతులు నిరసనలు చేపట్టారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
చట్టాలు రద్దు చేయాలి : సాయిల్ గౌడ్
రైతుల న్యాయమైన డిమాండ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని మేడ్చల్ జిల్లా సీపీఐ కార్యదర్శి సాయిలు గౌడ్ డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా దిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నప్పటికీ కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. లక్షలాది మంది రైతులు రాజధాని సరిహద్దుల్లో ఉద్యమాలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. వెంటనే పార్లమెంట్ సమావేశాల్లో రైతు చట్టాలను ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.