మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన పోలీసు చెక్‌పోస్టు వద్ద సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ చేశారు. లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించిన ఆయన... రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కూకట్పల్లి చెక్‌పోస్టు వద్ద సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ - Cp_Sajjanar_Visit at kukatpally police check post
సైబరాబాద్ సీపీ సజ్జనార్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి వై జంక్షన్‌లోని పోలీస్ చెక్‌పోస్టును ఆకస్మిక తనిఖీ చేపట్టారు. లాక్డౌన్ అమలవుతున్న తీరును పరిశీలించిన అనంతరం చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మామిడిపండ్లు అందజేశారు.
కూకట్పల్లి చెక్‌పోస్టు వద్ద సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీ
రోడ్డు వెంట నడుచుకుంటూ వెళుతున్న వలసకూలీలను ఆపి... వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం పలు చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మామిడిపండ్లు పంచిపెట్టారు.
ఇదీ చూడండి :ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!