లాక్‌డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించారు. ఆరు గంటల నుంచి దుకాణ సముదాయాల మూసివేత, లాక్‌డౌన్ నిబంధనలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏ విధంగా అమలు అవుతున్నాయి, తనిఖీలు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాచుపల్లి కూడలిలో వాహనాలను ఆపి సోదాలు చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు సూచించారు.
లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించిన సీపీ సజ్జనార్ - corona virus
లాక్‌డౌన్ సందర్భంగా బాచుపల్లి పీఎస్ పరిధిలోని నిజాంపేట్లో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు చేశారు.. రాత్రి సమయాల్లో లాక్‌డౌన్ అమలు తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించిన సీపీ సజ్జనార్