రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసు వాహనాల పార్కింగ్ కోసం అంబర్పేట్లోని హెడ్ క్యార్టర్స్లో ప్రత్యేకంగా షెడ్డు నిర్మించినట్లు సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. రూ.18 లక్షలతో నిర్మించిన ఈ షెడ్డులో ఒకేసారి 80 కార్లను నిలపవచ్చని తెలిపారు.
పోలీస్ వాహనాల పార్కింగ్ షెడ్డును ప్రారంభించిన సీపీ
అంబర్పేట్లోని పోలీస్ హెడ్ క్యార్టర్స్లో కమిషనరేట్ పరిధిలోని వాహనాల పార్కింగ్ కోసం నూతన షెడ్డు నిర్మించారు. సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.
పోలీస్ వాహనాల పార్కింగ్ షెడ్డును ప్రారంభించిన సీపీ
పార్కింగ్ కోసమే కాకుండా సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ షెడ్డు నిర్మాణం జరిగినట్లు సీపీ వివరించారు. షెడ్డు నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇదీచూడండి: శ్రావణి ఆత్మహత్య కేసు నిందితులకు 3 రోజుల పాటు కస్టడీ