మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కొవిడ్ నిర్ధరణ పరీక్షల కోసం అనుమానితులు ఆయా ప్రభుత్వ ఆసుప్రతులకు పరుగులు తీస్తున్నారు. భారీగా అనుమానితులు రావడం, సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఎండలోనే గంటల తరబడి నిలబడి పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. ఉప్పల్, రామంతాపూర్, నారపల్లి, ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రులకు ఉదయం 8 గంటల వరకే వందలాంది మంది పరీక్షల కోసం వస్తున్నారు.
కొవిడ్ పరీక్షల కోసం గంటల తరబడి ఎండలోనే... - Telangana covid test news
కొవిడ్ నిర్ధరణ పరీక్షల కోసం అనుమానితులు ఆయా ప్రభుత్వ ఆసుప్రతులకు పరుగులు తీస్తున్నారు. భారీగా అనుమానితులు రావడం, సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఎండలోనే గంటల తరబడి నిలబడి పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు.
covid
సిబ్బంది చెట్లు, వరండాలో అనుమానితుల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు. ఎండలోనే నిర్ధరణ పరీక్షలు చేయటంతో సిబ్బంది, అనుమానితులు ఆస్వస్థతకు గురవుతున్నారు. ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకాతో పాటు కరోనా నిర్ధరణ పరీక్షలు ఒకే చోట ఏర్పాటు చేయగా వచ్చిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరీక్షా కేంద్రాలను మరో చోటకు మార్పు చేయాలని పలువురు కోరుతున్నారు.