రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ ఠాణా పరిధిలోని పద్మారావు నగర్ కాలనీలో భార్యాభర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఘటనలో భర్త మృతి చెందాడు. భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరి మధ్య తలెత్తిన గొడవతో మనస్తాపం చెంది వేర్వేరు గదుల్లో ఉరివేసుకున్నారు. చుట్టుపక్కల వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన పోలీసులు కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న భార్య ప్రియాంకను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే భర్త మృతిచెందాడు.
భార్యాభర్త ఆత్మహత్యాయత్నం... ఒకరి మృతి - malkagigiri
భార్య భర్తల మధ్య గొడవ ఆ సంసారాన్ని కకావికలం చేసింది. మనస్తాపంతో ఇద్దరూ ఆత్మహత్యకు యత్నించారు. ఘటనలో భర్త మృతిచెందగా భార్య కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. రాచకొండ కమిషనరేట్ జవహార్‌నగర్ పరిధిలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
![భార్యాభర్త ఆత్మహత్యాయత్నం... ఒకరి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3393552-thumbnail-3x2-suicide.jpg)
couple suicide attempt
TAGGED:
malkagigiri