కొంపల్లి మున్సిపల్ ఛైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్‌ను కాంగ్రెస్ కౌన్సిలర్ జ్యోత్న్స నిలదీశారు. ఇటీవలే కొంపల్లికి బదిలీపై వచ్చిన కమిషనర్ రఘు... మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో తిరుగుతూ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ 11వ వార్డులో ఛైర్మన్‌తో కలిసి పర్యటించారు. సమస్యలను కమిషనర్‌కు చెబుతుండగా... ఇదంతా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డితో చెప్పాలని ఛైర్మన్ అన్నారని కౌన్సిలర్ ఆరోపించారు.
'ఎంపీ రేవంత్... దృష్టికి తీసుకెళ్లమనడం దారుణం' - Medchal fistrict news
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించమంటే మున్సిపల్ ఛైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ కౌన్సిలర్ జ్యోత్న్స ఆరోపించారు.
'ఎంపీ రేవంత్... దృష్టికి తీసుకెళ్లమనడం దారుణం'
ఆవేదనకు గురై ఛైర్మన్‌ను నిలదీశామని జ్యోత్న్స అన్నారు. మున్సిపల్ పరిధిలోని సమస్యలను ఛైర్మన్ దృష్టికి కాకుండా ఎంపీ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లమనడం దారుణమన్నారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించకుండా వ్యక్తిగతంగా తనపై దుర్భాశలాడుతున్నారని వాపోయింది.
ఇదీ చూడండి:'అప్పులతో కాదు.. సంపదను పెంచుతూ అభివృద్ధి చేయండి'