మేడ్చల్ జిల్లా మల్లాపూర్ గ్రీన్ హిల్స్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపం లేకుండా.. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు.
'పనులను త్వరితగతిన పూర్తి చేయండి' - డ్రైనేజీ పనులు
మేడ్చల్ జిల్లా మల్లాపూర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పలు నిర్మాణాల పురోగతి గురించి అధికారులనడిగి తెలుసుకున్నారు.
Mallapur division
డ్రైనేజ్ బాక్స్, డ్రైన్ లైన్ పనుల పురోగతి గురించి దేవేందర్ రెడ్డి అధికారులనడిగి తెలుసుకున్నారు. రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో.. ఏఈ వేణు, వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, కాలనీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:బ్లాక్ ఫంగస్ ఔషధాలు కావాలంటే మెయిల్ చేయండి: కేటీఆర్