మల్కాజిగిరిలో 46 మందికి కరోనా నిర్ధరణ - corona updates telangana
16:55 June 23
మల్కాజిగిరిలో 46 మందికి కరోనా నిర్ధరణ
మల్కాజిగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో శనివారం వరకు నిర్వహించిన పరీక్షలలో 46 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. బాధితులలో ఐదు నెలలు, రెండేళ్ల చిన్నారులు ఉన్నారు. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న నలుగురు వైద్యులు, ఆయాకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. మలేరియా సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. వైరస్‌తోనే ఆశా వర్కర్ సర్వే చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనా సోకిన వారిలో 31 మంది పురుషులు, 15 మంది మహిళలు ఉన్నారు.
ఇవీ చూడండి:సిరిసిల్లను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం:కేటీఆర్