మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొవిడ్ నిర్ధరణ పరీక్షల కోసం ప్రజలు ఆయా ప్రభుత్వ ఆసుప్రతులకు పరుగులు తీస్తున్నారు. సరైన సదుపాయలు లేకపోవడం వల్ల చెట్లు కిందనే సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. ఉప్పల్, రామంతాపూర్, నారపల్లి, ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద వందలాది మంది పరీక్షల కోసం వస్తున్నారు. దీంతో సిబ్బంది చెట్ల కింద బాధితుల నుంచి నమూనాలు సేకరిస్తున్నారు.
వివిధ సమస్యలతో బాధపడుతున్న రోగులు చికిత్స కోసం కేంద్రాలకు రావాలంటే.. ఆందోళన చెందుతున్నారు. ఎండలోనే నిర్ధరణ పరీక్షలు చేయడంతో సిబ్బంది అస్వస్థతకు గురయ్యే ప్రమాదమూ ఉంది. నారపల్లిలో మాత్రం ఆసుపత్రిలో పని చేసే వాళ్లే కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఉప్పల్లో 82 మందికి పరీక్షలు నిర్వహించగా.. 41 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది.