మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పరీక్షలు చేయించుకోవడానికి భారీ సంఖ్యలో కేంద్రం వద్దకు చేరుకున్నారు. భౌతిక దూరం పాటించకుండా సుమారు 300 మంది క్యూలో నిలబడుతున్నారు.
కరోనా పరీక్షల కోసం తిప్పలు.. కేంద్రాల వద్ద బారులు - corona tests in suraram primary health care centre
కరోనా అనుమానితులకు నిర్ధరణ పరీక్షల కోసం తిప్పలు తప్పడం లేదు. గంటల కొద్దీ లైన్లలో వేచి ఉన్నా తమ వంతు రాక వెనుదిరుగుతున్నారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గ పరిధిలో వందల సంఖ్యలో ప్రజలు టెస్టింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
సూరారంలో ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టులు
తెల్లవారుజాము నుంచే టెస్టుల కోసం వచ్చి లైన్లో నిలుచున్నామని కొవిడ్ అనుమానితులు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద టెస్టుల కోసం 3,4 రోజుల నుంచి తిరుగుతున్నా తమ వంతు రావడం లేదని వాపోతున్నారు.
ఇదీ చదవండి:సూది మందు పంపుతామని.. చుక్కలు చూపుతున్నారు