హైదరాబాద్ కూకట్పల్లి జంట సర్కిళ్లలో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. కూకట్పల్లి ప్రాంతంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంతో పాటు సమీపంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని ప్రాథమిక ఆసుపత్రి, ఎల్లమ్మబండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దీనబంధు కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా కట్టడికి సర్వత్రా అప్రమత్తం - corona updates
కూకట్పల్లి జంట సర్కిళ్లలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దీంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కూకట్‌పల్లిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాల్లో రాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కరోనా కట్టడికి సర్వత్రా అప్రమత్తం
మూడు రోజులుగా పరీక్షలు చేస్తుండటంతో సమీపంలో ఉండే వారు, పాజిటివ్ వచ్చిన వారితో ప్రాథమికంగా కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తులు కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సెంటర్లో కరోనా లక్షణాలు ఉన్న గర్భిణీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్లలో పరీక్షలు కొనసాగిస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండీ:చేవెళ్ల మండలంలో తొలి కరోనా మరణం