మేడ్చల్ జిల్లా పోచారం పురపాలక సంఘం పరిధిలో ఓ వ్యక్తి నుంచి పది వేల రూపాయలు లంచం తీసుకుంటున్న ఒప్పంద బిల్లు కలెక్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఐకేగూడకు చెందిన కిరాణా వ్యాపారి బాల్‌రాజ్ ఇటీవల తన వదిన స్వర్ణలత నుంచి 67 గజాల ఇంటిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన అతనిని సబ్ రిజిస్ట్రార్ పురపాలక సంఘం నుంచి ఎన్‌వోసీ తీసుకురమ్మన్నారు.
అనిశాకు చిక్కిన ఒప్పంద పురపాలక ఉద్యోగి - అనిశాకు చిక్కిన అవినీతి అధికారి
మేడ్చల్ జిల్లాలో ఓ అవినీతి అధికారి అనిశాకు చిక్కాడు. పది వేల రూపాయలు లంచం తీసుకుంటూ నేరుగా పట్టుబడ్డాడు.
ACB RIDES in Medchal district latest news
పురపాలక కార్యాలయంలో ఎన్‌వోసీ కోసం బాల్‌రాజ్ దరఖాస్తు చేసుకున్నాడు. ఒప్పంద బిల్లు కలెక్టర్ కుమారస్వామి 25వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాల్‌రాజ్ అనిశా అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు కార్యాలయంలో బిల్లు కలెక్టర్కు పదివేల రూపాయలు ఇచ్చాడు. వెంటనే అధికారులు అతని నుంచి లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అనిశా అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి:అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారుల కొరడా