మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని కన్వెన్షన్ సెంటర్లో కాంగ్రెస్ రాజకీయ శిక్షణ తరగతులు(Congress Party Political training classes) ప్రారంభమయ్యాయి. పార్టీ జెండాను ఆవిష్కరించి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC chief Revanth Reddy) శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఇవాళ, రేపు ఈ తరగతులు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ కమిటీ అధ్యక్షులకు శిక్షణ ఇస్తున్నట్లు రేవంత్(TPCC chief Revanth Reddy) చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 9 నుంచి 10 మంది శిక్షణకు హాజరయ్యారు. నియోజకవర్గాల వారీగా వారి కోసం ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు.
రసాభాస
కార్యక్రమం ప్రారంభంలోనే (Congress Party Political training classes) రసాభాస జరిగింది. రేవంత్ రెడ్డి(TPCC chief Revanth Reddy) ప్రసంగిస్తుండగా.. జనగామ జిల్లా నేతలు ఆందోళన చేశారు. జిల్లాలో ఇన్ఛార్జుల నియామకంపై వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను నిలదీశారు. ఆ నేతలకు సర్దిచెప్పిన రేవంత్.. మధ్యాహ్న భోజన సమయంలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే.. సీనియర్ నేతలను సంప్రదించి పరిష్కరించుకోవాలని.. అంతేగానీ క్రమశిక్షణ మరిచి ఇతరులు బురదజల్లేలా చేసుకోవద్దని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పార్టీలో క్రమశిక్షణారాహిత్యం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
"కాంగ్రెస్ కార్యకర్తలంతా గల్లీలో కష్టపడితే.. దిల్లీలో మన పార్టీ అధికారంలోకి వస్తుంది. 131 కోట్ల ప్రజల ఆకాంక్షలను తీరుస్తుంది. మీరు కష్టపడితేనే సోనియమ్మ రాజ్యం వచ్చి తెలంగాణ ప్రజలకు నియంత పాలన నుంచి విముక్తి లభిస్తుంది. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ కార్యక్రమం ద్వారా చర్చిద్దాం. రాహుల్ గాంధీ నాయకత్వంలో.. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతోంది. 34,706 పోలింగ్ బూత్‌లలో ప్రతి బూత్‌కు ఓ ఎన్‌రోలర్ ఉంటాడు. ఆ వ్యక్తి తన వద్ద ఉన్న ఫోన్లో కాంగ్రెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని.. ఆ ప్రాంతంలో ఉన్న ఓటర్లను మన పార్టీలో చేరేలా ప్రోత్సహించి వారి పేర్లను యాప్‌లో నమోదు చేస్తాడు."
- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
కలిసికట్టుగా ఉందాం..