తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రానికి వాటా ఉంది... చొరవ తీసుకోవాలి: రేవంత్​ - Congress Malkajgiri MP Revanth Reddy

కాంగ్రెస్​ మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​రెడ్డి పార్లమెంట్​లో రాష్ట్ర సర్కార్​పై ధ్వజమెత్తారు. ఆర్టీసీ సమ్మె గత 52 రోజులుగా జరిగిన ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్మికులు విధుల్లో చేరుతామని చెప్పినా... ప్రభుత్వం స్పందించడంలేదని అన్నారు.

Congress Malkajgiri MP Revanth Reddy has raised his voice on the state government in Parliament
కేంద్రానికి వాటా ఉంది... చొరవ తీసుకోవాలి: రేవంత్​

By

Published : Nov 28, 2019, 9:52 AM IST

తెలంగాణ గత 52 రోజులుగా జరిగిన సమ్మెను పార్లమెంట్​లో కాంగ్రెస్​ మల్కాజ్​గిరి ఎంపీరేవంత్​రెడ్డి ప్రస్తావించారు. ప్రభుత్వం కార్మికులను అసలు పట్టించుకోవట్లేదని, కేంద్రం సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

గత 52 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా... 30 మందికి పైగా కార్మికులు చనిపోయినా... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కేంద్రం దృష్టికి తెచ్చారు. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపలేదని, సమ్మె ముగించి ఉద్యోగాల్లో తిరిగి చేరుతామన్నా... ప్రభుత్వం వినే పరిస్థితిలో లేదని మండిపడ్డారు.

బాబు అనే కరీంనగర్​కు చెందిన ఆర్టీసీ కార్మికుడు చనిపోతే... అంత్య క్రియల్లో జరిగిన గొడవలో ఎంపీ బండి సంజయ్​పై రాష్ట్ర పోలీసులు దాడి చేశారని... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆర్​ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీని ప్రైవేట్​ పరం చేసే ఆలోచన చేస్తోందని... 33శాతం కేంద్రం వాటా కూడా ఉందని... కావునా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోని చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

కేంద్రానికి వాటా ఉంది... చొరవ తీసుకోవాలి: రేవంత్​

ఇదీ చూడండి: కాంగ్రెస్​-శివసేన-ఎన్​సీపీ కూటమిపై అమిత్ షా ఫైర్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details