మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ జిల్లా కార్యాలయం ముందు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ఒక పక్క కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై భారం మోపడం కేంద్ర ప్రభుత్వానికి న్యాయం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రజలు ఇప్పటికే కష్టాల్లో ఉంటే.. వారిపై ధరల భారం మోపడం సరికాదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పాలకులు కోలుకోలేని విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆదాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సింది పోయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మేడ్చల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందజేశారు.
ఇవీ చూడండి:హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్