తెలంగాణ

telangana

ETV Bharat / state

Shabbir ali: అసంతృప్తులతో మాట్లాడుతున్నాం: షబ్బీర్​ అలీ - telangana news

రేవంత్​ రెడ్డి నాయకత్వాన్ని యువత బలంగా కోరుకుంటోందని మాజీ మంత్రి షబ్బీర్​ అలీ పేర్కొన్నారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్​ రెడ్డి ఎన్నికైన సందర్భంగా రేవంత్​ను షబ్బీర్​ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై ఇరువురూ చర్చించారు.

shabbeer ali met revanth reddy
షబ్బీర్​ అలీ, రేవంత్ రెడ్డి

By

Published : Jun 27, 2021, 2:08 PM IST

Updated : Jun 27, 2021, 2:57 PM IST

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులతో మాట్లాడుతున్నామని.. పరిస్థితులన్నీ త్వరలోనే సర్దుకుంటాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డిని.. మల్కాజిగిరి పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో షబ్బీర్​ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కొద్ది సేపు ఇరువురు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ కార్యకర్తలంతా సిపాయిలుగా పనిచేయాల్సిన సమయం ఇది. యువత.. రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటోంది. కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం. -షబ్బీర్​ అలీ, కాంగ్రెస్​ మాజీ మంత్రి

కాంగ్రెస్​ కార్యకర్తలంతా సిపాయిల్లా పనిచేయాలి: షబ్బీర్​ అలీ

ఫిక్సింగ్​ జలజగడం

తెలంగాణ, ఆంధ్రా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని జలజగడాన్ని కొనసాగిస్తున్నారని షబ్బీర్​ అలీ ఆరోపించారు. నిన్న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి​తో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు.

టీపీసీసీ చీఫ్​గా ఉత్తమ్​ కుమార్​ రెడ్డి రాజీనామా చేసిన అనంతరం ఆ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఇన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. దానికి తెరదించేలా పార్టీ అధిష్ఠానం.. రేవంత్​ రెడ్డిని అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఆయన టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగారు.

ఇదీ చదవండి:DGP : మరియమ్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు

Last Updated : Jun 27, 2021, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details