తెలంగాణ

telangana

ETV Bharat / state

గులాబీ చొక్కా వివాదం.. తెరాస-భాజపాల మధ్య వాగ్వాదం - తెరాస-భాజపాల మధ్య వాగ్వాదం

మేడ్చల్ జిల్లా మల్కాజిగి​రి​ పోలింగ్​ కేంద్రంలో తెరాస- భాజపా వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గులాబీ రంగు చొక్కా వేసుకుని వచ్చిన తెరాస కార్యకర్తలను.. కమలం నేతలు కేంద్రంలోనికి రాకుండా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది.

Conflict between Trs and bjp in mlc elections in malkajgiri medchal
గులాబీ చొక్కా వివాదం.. తెరాస-భాజపాల మధ్య వాగ్వాదం

By

Published : Mar 14, 2021, 9:33 PM IST

పోలింగ్​ కేంద్రానికి తెరాస కార్యకర్తలు గులాబీ రంగు చొక్కాలు ధరించి రావటంపై.. భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న అనంతరం.. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగింది.

పార్టీ రంగు చొక్కా వేసుకుని పోలింగ్​ కేంద్రానికి వచ్చిన తెరాస కార్యకర్తలను.. కమలం నేతలు అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు.. అందరిని అక్కడినుంచి పంపివేశారు.

ఇదీ చదవండి:ఓటర్లకు డబ్బుల పంపిణీ!.. వైరల్ అయిన వీడియో

ABOUT THE AUTHOR

...view details