తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడ్చల్​ జిల్లాలో వరద బాధితుల ఆందోళన - వరద సాయం తాజావార్తలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరదసాయం అందలేదని బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. ఎక్కడ చూసినా తమకు పరిహారం అందలేదంటూ గ్రేటర్ కార్యాలయాలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల నివాసం ముందు ధర్నాలు చేపట్టారు. తమ అనుచరులకే సాయం చేసి.. అసలైన బాధితులను పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.

Concern of flood victims in Medchal district
మేడ్చల్​ జిల్లాలో వరద బాధితుల ఆందోళన

By

Published : Oct 31, 2020, 1:54 PM IST

మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో వరద బాధితులు మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీనివల్ల రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను పంపించే ప్రయత్నం చేశారు.

మేడ్చల్​ జిల్లాలో వరద బాధితుల ఆందోళన

ఉప్పల్‌ జీహెచ్​ఎంసీ కార్యాలయం ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. అధికార పార్టీకి చెందిన వారికే డబ్బులు ఇస్తున్నారని... అసలైన బాధితులకు సాయం అందడంలేదని వాపోయారు. పెద్ద ఎత్తున బాధితులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్నవారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. సాయం అందించడంలోనూ వివక్ష చూపుతున్నారని బాధితులు మండిపడ్డారు.

ఇవీచూడండి:వరద సాయం కోసం నగరంలో పలుచోట్ల బాధితుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details