దేశ భద్రతలో వాయుసేన కీలకంగా వ్యవహరిస్తోందని ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా వెల్లడించారు. కొవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ సరఫరాలో వైమానికదళం కీలకపాత్ర పోషించిందని ప్రశంసించారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు బదౌరియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ వందనం స్వీకరించి.. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ అధికారులకు వింగ్స్ ప్రదానం చేశారు.
Air Force : 'దేశ భద్రతలో వాయుసేనది కీలకపాత్ర' - Combined Graduation Parade 2021
దేశం కోసం ప్రాణాలైన త్యాగం చేయడానికి ఫ్లయింగ్ అధికారులు వెనకాడరని ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్(Air Force) అకాడమీలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు హాజరై.. శిక్షణ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ అధికారులకు వింగ్స్ ప్రదానం చేశారు.
వైమానిక దళంలో 161 మంది, నేవీలో ఆరుగురు, కోస్ట్ గార్డ్‌లో ఐదుగురు క్యాడెట్లకు శిక్షణ పూర్తి చేసుకున్నారు. మొత్తం 172 ఫ్లయింగ్ అధికారులను బదౌరియా అభినందించారు. వీళ్లలో 87 మంది బీటెక్ చేసి ఫ్లయింగ్ అధికారులుగా శిక్షణ పొందారు. 20వేల500 గంటల ఫ్లయింగ్ శిక్షణను ఈ బ్యాచ్ పూర్తిచేసింది. శిక్షకులకు, ఇతర సిబ్బందిని ప్రశంసించిన ఎయిర్ చీఫ్ మార్షల్ బదౌరియా.. దేశం కోసం త్యాగం చేయడమే ఫ్లయిగ్ అధికారుల ధ్యేయమని కొనియాడారు. సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని బదౌరియా స్పష్టం చేశారు.