మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపడుతోన్న పనులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. భోజనం ఎలా పెడుతున్నారని గర్భిణులు, చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదిలోకి వెళ్లి.. విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధించారు. చెరువు వద్ద మురుగునీరు నిల్వ ఉండడాన్ని చూసి.. ప్రత్యామ్నాయం చూపాలని ఛైర్ పర్సన్‌కు సూచించారు.
కండ్లకోయలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - మేడ్చల్ కలెక్టర్ తాజా వార్తలు
పట్టణ ప్రగతిలో భాగంగా చేపడుతోన్న పనులపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గ్రామంలో తిరుగుతూ.. సమస్యల గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు.

కండ్లకోయలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ