తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీ భారత్ ఎఫెక్ట్... కబ్జా స్థలాల్లో మొక్కలు నాటిన కలెక్టర్ - మేడ్చల్​ జిల్లాలో హరిహారం కార్యక్రమం

మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లాలోని ప్రభుత్వ స్థలాల్లో అధికారులు ఏర్పాటు చేసిన సూచికలను తీసేసి భూమిని కబ్జా చేసిన ప్రాంతాల్లో కలెక్టర్​ వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

collector haritha haram program in medchal district
సూచికలను తీసేసి కబ్జా చేసిన స్థలాల్లో కలెక్టర్​ హరిహారం

By

Published : Sep 5, 2020, 11:16 AM IST

రూ. కోట్ల విలువైన స్థలాల్లో అధికారులు ఏర్పాటు చేసిన సూచికలను.. కబ్జాదారులు తొలగించిన ప్రాంతంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మొక్కలు నాటి నీరు పోశారు. పోచారం పురపాలక సంఘం పరిధిలో నారపల్లి, మహాలక్ష్మిపురంలోని ఓ లేఅవుట్లో.. కాలనీ అభివృద్ధి కోసం 1026 గజాలు, 611 గజాలు చొప్పున ఖాళీ స్థలాలు కేటాయించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశాల మేరకు సదురు భూములలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

వాటిని కొన్ని రోజులకే కబ్జాదారులు తొలగించారు.. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడం వల్ల.. పలువురు స్థానికులు గత నెల 27వ తేదీన 'ఈనాడు -మేమున్నాము... మీకు తోడుగా'కు ఫోను ద్వారా సంప్రదించారు. గత 28వ తేదీన 'సూచికలను తొలగించి స్థలాలు ‌కబ్జా'అంటు 'ఈనాడు, ఈటీవీ భారత్​'లో కథనం ప్రచురితమైంది. ‌దీనిపై స్పందించిన కలెక్టర్​ ప్రభుత్వ‌ ఖాళీ స్థలాలు, చెరువు కట్ట, ఇతర ఖాళీ ప్రదేశాలో మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రఘు, ఛైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్​ సహించదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details