మేడ్చల్ జిల్లా నిజాంపేట్లో మున్సిపల్ నామినేషన్ ప్రక్రియ కార్యాలయాన్ని కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డు కార్యాలయాల్లో నామినేషన్ దరఖాస్తు ఏవిధంగా పొందు పరచాలి, ఎలా పూర్తి చేశారు అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినహెల్ప్డెస్క్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిశీలన అధికారి ఎల్లప్పుడు పరిశీలిస్తారని కలెక్టర్ తెలిపారు.
నామినేషన్ కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - Collector contingency checks at the electoral nomination center at nizampet in madchal district
నిజాంపేట్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కార్యాలయాన్ని మేడ్చల్ కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల పనితీరును పరిశీలించారు.

ఎన్నికల నామినేషన్ కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ఎన్నికల నామినేషన్ కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ఇదీ చూడండి: 'హైదరాబాద్ విషయంలో అలాంటి ప్రతిపాదనే లేదు'