తెలంగాణ

telangana

కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే

మేడ్చల్​ జిల్లా నిజాంపేట మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయంలో కో-ఆప్షన్​ సభ్యుల ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

By

Published : Sep 19, 2020, 3:01 PM IST

Published : Sep 19, 2020, 3:01 PM IST

Co-option members election program at Nizampet Municipal Office
కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నిజాంపేట మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయంలో కో-ఆప్షన్​ సభ్యుల ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. అధికార పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు ఎన్నికయ్యారు.

గత జనవరిలో కార్పొరేషన్​కు మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరగగా.. తెరాస నుంచి 27 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజాంపేట నుంచి అభిషేక్ రెడ్డి, తలారి వీరేష్, బాచుపల్లి నుంచి సయ్యద్ అలీ, మాజీ ఉప సర్పంచ్, ఎన్. వాణి, సి.హెచ్.జ్యోతిలు ఎంపికైనట్లు మేయర్​ గోపాల్​రెడ్డి ప్రకటించారు.

ఇదీచూడండి.. చిన్నారి సుమేధ అంత్యక్రియలు పూర్తి

ABOUT THE AUTHOR

...view details