CM KCR Speech at Medchal Public Meeting :సమైక్యపాలనలో అరిగోసలు పడ్డ తెలంగాణ.. నేడు స్వరాష్ట్ర పాలనలో దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మేడ్చల్లో(CM KCR Medchal Meeting) ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్పాల్గొని ప్రసంగించారు. ఆనాడు తెలంగాణలో కరెంట్ లేదు. మంచినీరు లేదని.. అడుగడుగునా వివక్ష గురయ్యామన్నారు.
CM KCR Speech at Jadcherla Praja Ashirwada Sabha : 'కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డాం.. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటోంది'
KCR Medchal Meeting Today :సమైక్య పాలకుల కాలంలో 1956లో చిన్న పొరపాటు జరిగి.. అప్పటి తెలంగాణ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గితే 58 సంవత్సరాలు కష్టాలు పడ్డామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అహంకారపూరితంగా.. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోమని అంటే.. కాంగ్రెస్ నాయకులు నోరెత్తలేదని కేసీఆర్ గుర్తుచేశారు.
ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేస్తే.. అప్పటి కాంగ్రెస్ నాయకులు అవహేళన చేశారన్నారు. వాటన్నింటిని దిగమింగుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగమన్నారు. నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామి స్థానానికి చేరుకుందన్నారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.
Medchal Praja Ashirwada Sabha : ఈరోజు తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారిందని.. మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మేడ్చల్, కుత్భుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్ ఓ మిని భారతదేశమని.. ఇక్కడికి ఎంతో మంది పొట్టచేత పట్టుకుని వస్తారన్నారు. ఒక్క మేడ్చల్ నియోజకవర్గానికే 26000 డబుల్ బెడ్ రూం ఇళ్లు వచ్చాయని.. మల్లారెడ్డి తెలిపారన్నారు. వీటన్నింటిని ఒక్క రూపాయి తీసుకోకుండా పారదర్శకంగా పంపిణీ చేశామన్నారు. హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామన్నారు.
Telangana Assembly Elections 2023 : హైదరాబాద్కు వచ్చే వారు ఎక్కువ శాతం ఇక్కడే స్థిరపడుతున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ హమీ ఇచ్చారు. రాష్ట్రంలో రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం అందిస్తామన్నారు. పింఛన్లను దశల వారీగా పెంచుతామన్నారు. మల్లారెడ్డి లాంటి అనుభవం ఉన్నవాళ్లు, మంచి వాళ్లు ఉంటే మేడ్చల్ అభివృద్ధి చెందుతుంది.
మల్లారెడ్డి వంటి సమర్ధవంతమైన నేత మేడ్చల్ నియోజకవర్గానికి కీలకమని.. ఈ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వాదించాలని కేసీఆర్ ప్రజలను కోరారు. నేడు ఎన్నికల వేళ మాయమాటలు చెబుతూ వస్తారని.. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం వచ్చిందని.. ఆపద మొక్కులు మొక్కే వారిని నమ్మొద్దని కేసీఆర్ కోరారు.
"సమైక్యపాలనలో అరిగోసలు పడ్డ తెలంగాణ.. నేడు స్వరాష్ట్ర పాలనలో దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారింది. ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేస్తే.. అప్పటి కాంగ్రెస్ నాయకులు అవహేళన చేశారు. ఈరోజు తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా మారింది. మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్ ఓ మినీ భారతదేశం. హైదరాబాద్కు వచ్చే వారు ఎక్కువ శాతం ఇక్కడే స్థిరపడుతున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాము".- కేసీఆర్, సీఎం
CM KCR Speech at Medchal Public Meeting "హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తాం" CM KCR Speech at Siddipet Praja Ashirwada Sabha : 'ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీ రికార్డును సిద్దిపేట ప్రజలు బద్దలుకొట్టాలి'
CM KCR Speech at Sircilla Public Meeting : 'ధరణి ఉండాలో.. రద్దు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'