మేడ్చల్ జిల్లా కుషాయిగూడ చక్రిపురంలో బుధవారం రాత్రి ఇరువర్గాల యువకుల మధ్య ఘర్షణ(Street Fight) చోటుచేసుకుంది. కొంతమంది యువకులు తమ ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ... కారణం లేకుండా ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని స్వాతి అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Street Fight: ఇరువర్గాల ఘర్షణ.. పీఎస్‌లో ఆందోళన - మేడ్చల్ జిల్లా క్రైం వార్తలు
బుధవారం అర్ధరాత్రి పలువురు యువకులు హల్చల్ చేశారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ(Street Fight).. చినికిచినికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఈ మేరకు తమ ఇంటిపై పలువురు దాడి చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని కాలనీవాసులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
Street Fight: ఇరువర్గాల ఘర్షణ.. పీఎస్‌లో ఆందోళన
తమ కుటుంబ సభ్యులపైన కూడా దాడి చేసి కొట్టారని ఆ యువతి పోలీసులకు తెలిపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీస్‌స్టేషన్‌కు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేశారు.