పోలీసులను చూస్తేనే పిల్లలు ఆమడదూరం పారిపోతారు. ఇంకా వారితో మాట్లాడాలంటే.. ఫిర్యాదు చేయాలంటే అంతే సంగతులు. చాలా మంది పోలీసులకు సైతం పిల్లలతో ఎలా మెలగాలో తెలియదు. బాలలే బాధితులైతే వారితో ఎలా వ్యవహరించాలో అవగాహన లేదు.. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రాచకొండ పోలీసులు అడుగులు ముందుకేశారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థికి చెందిన బచ్పన్ బచావో స్వచ్ఛంద సంస్థతో కలిసి మేడ్చల్ జిల్లాలో మేడిపల్లి ఠాణాను తీర్చిదిద్దారు. బాలల దినోత్సవం సందర్భంగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.
బాలమిత్ర పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్ - medipally police station as balamitra ps
మేడ్చల్ జిల్లాలో మేడిపల్లిలో బాలమిత్ర పోలీస్‌స్టేషన్‌ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.
బాలమిత్ర పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్
ఠాణాలో ప్రత్యేకంగా ఓ గదిని బాలమిత్ర పోలీస్‌స్టేషన్‌కు కేటాయించారు. కార్టూన్లు, వివిధ రకాల పెయింటింగ్‌తో గదిని అలంకరించారు. పిల్లలతో ఎలా వ్యవహరించాలనే అంశంపై ఇద్దరు కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏదైనా కేసులో మైనర్లు బాధితులుగా ఉంటే వారిని ఈ స్టేషన్‌కు తీసుకొచ్చి సమాచారం సేకరిస్తారు.
ఇవీచూడండి: 'పుస్తకాలు చదవాల్సిన అవసరం చాలా ఉంది'