మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ 8 డివిజన్లకు చెందిన 666 మంది లబ్ధిదారులకు.. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అందజేశారు. కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు.
'ఆపదలు వచ్చినా సంక్షేమ పథకాలను ఆపేది లేదు' - cheques distribution in qutbullapur constituency
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 666 మందికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చెక్కులను పంపిణీ చేశారు.
ఎంతటి విపత్తు వచ్చినా పేద ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తూనే ఉందని ఎమ్మెల్యే అన్నారు. పేదల సంక్షేమాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదల పాలిట పెన్నిధిగా మారారని వెల్లడించారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, లాక్డౌన్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:రాజకీయ పట్టింపులకు పోకుండా రెండో డోసు ఇవ్వాలి: కిషన్ రెడ్డి