కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ఆడబిడ్డల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. నియోజకవర్గంలోని సుభాష్‌నగర్ డివిజన్లో పలు కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి 17 మంది లబ్ధిదారులకు రూ.17,01,972 విలువైన చెక్కులను అందజేశారు.
ఇంటింటికీ వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పేద ఆడబిడ్డలకు పెళ్లి భారం కాకూడదనే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నియోజకవర్గ పరిధిలోని సుభాష్‌నగర్ డివిజన్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందించారు.

ఇంటింటికీ వెళ్లి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
పేద ఆడబిడ్డలకు పెళ్లి భారం కాకూడదనే ప్రభుత్వం పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. డివిజన్లోని హమీద్ బస్తీ, నర్సింహా బస్తీ, ప్రియాంకనగర్, మైత్రినగర్, తెలుగుతల్లినగర్, ఆనంద్నగర్లలో ఇంటింటికీ వెళ్లి చెక్కులను అందించారు. అర్హులైన ప్రతిఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.