తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటైన్​మెంట్​ జోన్​లో రసాయనిక ద్రావణం పిచికారి - కంటైన్​మెంట్​ జోన్​లో రసాయనిక ద్రావణం పిచికారి

కరోనా వైరస్​ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా సికింద్రాబాద్ కంటోన్మెంట్​లోని ఐదో వార్డులో కొవిడ్​ బారిన పడిన బాధితుల ఇళ్ల వద్ద స్థానిక తెరాస నేత సాయంతో సామాజిక కార్యకర్త సతీష్​ గుప్తా రసాయనిక సోడియం హైడ్రోక్లోరైట్​ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

chemical-spraying-in-containment-zone-at-secunderabad
కంటైన్​మెంట్​ జోన్​లో రసాయనిక ద్రావణం పిచికారి

By

Published : Jul 8, 2020, 1:29 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా సికింద్రాబాద్ కంటోన్మెంట్​లోని ఐదో వార్డులో రోజురోజుకు కొవిడ్ కేసులు వ్యాపిస్తున్నందున సామాజిక కార్యకర్త సతీష్​ గుప్తా మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. కంటోన్మెంట్​ తెరాస నేత మల్లికార్జున్ సహకారంతో కరోనా కేసులు అధికంగా ఉన్న కంటైన్​మెంట్ ప్రాంతంతో రసాయనిక సోడియం హైడ్రోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

కరోనా వేగంగా విజృంభిస్తున్నందున ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న కాలనీని రెడ్​జోన్​గా ప్రకటించాలన్నారు. నియోజకవర్గంలో కేసులు పెరుగుతున్నా అధికారులు పూర్తిస్థాయిలో వైరస్​ కట్టడికి కృషి చేయట్లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సతీష్​ కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details