బల్దియా ఎన్నికల్లో గెలుపు ఆల్వాల్ డివిజన్ ప్రజల విజయమని తెరాస అభ్యర్థి సబితా కిశోర్ అన్నారు. ఆల్వాల్ డివిజన్ 135వ డివిజన్ అభ్యర్థి విజయం సాధించడంతో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.
ఆల్వాల్ డివిజన్లో తెరాస శ్రేణుల సంబురాలు - జీహెచ్ఎంసీ ఆల్వాల్‌లో తెరాస సంబురాలు
గ్రేటర్ ఎన్నికల్లో ఆల్వాల్ 135డివిజన్ అభ్యర్థి సబితా కిశోర్ విజయం సాధించడంతో తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు.
ఆల్వాల్ డివిజన్లో తెరాస శ్రేణుల సంబురాలు
పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఆల్వాల్‌లోని లయోలా జూనియర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగింది.