నేరాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తున్న సీసీ కెమెరాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కీసరలో రూ. 20 లక్షలతో ఏర్పాటు చేసిన 136 సీసీ కెమెరాలను మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు.
నేరాలు తగ్గించడంలో సీసీ కెమెరాలది కీలకపాత్ర: మల్లారెడ్డి - rachakonda cp news
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దాతలు ఇచ్చిన విరాళాలతో నూతనంగా ఏర్పాటు చేసిన 136 సీసీ కెమెరాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.
కీసరలో సీసీ కెమెరాల ప్రారంభం
రాచకొండ కమిషనరేట్ పరిధిలో దాదాపు లక్షా 25 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీపీ మహేశ్‌భగవత్ అన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి:ఏప్రిల్ నుంచే ప్రైవేటు టీచర్లకు సాయం