మేడ్చల్ జిల్లా సురారంలో ఆర్థిక ఇబ్బందులతో కేబుల్ ఆపరేటర్ భాస్కర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడిని భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సురారం మస్తాన బిల్డర్స్‌లో గత ఎనిమిదేళ్లుగా భార్య, పిల్లలతో భాస్కర్ నివాసముంటున్నాడు. కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం.. అతని భార్య, ఇద్దరు పిల్లలతో దుండిగల్‌లోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లగా భాస్కర్ మాత్రం ఇంటివద్దే ఉన్నాడు. ఎన్నిసార్లు ఫోన్‌చేసినా స్పందించకపోవడంతో.. కంగారుపడిన భార్య ఇంటికొచ్చి చూసింది. ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. భాస్కర్ గతంలోనే పురుగుల మందు తాగేందుకు యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని సమాచారం.
ఆర్థిక ఇబ్బందులతో కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్య - medchal news
మేడ్చల్ జిల్లా సురారంలో ఆర్థిక ఇబ్బందులతో కేబుల్ ఆపరేటర్ భాస్కర్ బలవన్మరణానికి పాల్పడ్డారు. గతంలోనూ ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్య