తెలంగాణ

telangana

ETV Bharat / state

జోరుగా బోయిన్​చెరువులో గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియ - బోయిన్​చెరువులో గుర్రపు డెక్క తొలగింపు

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఓల్డ్​ బోయిన్​పల్లి డివిజన్​ పరిధిలోని బోయిన్​ చెరువులో ఉన్న గుర్రపు డెక్క సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కార్పొరేటర్ నరసింహ యాదవ్ అడుగులు వేశారు. గుర్రపు డెక్కను యంత్రాలతో శుద్ధి చేస్తూ చెరువును మినీ ట్యాంక్​బండ్​గా మార్చనున్నట్లు ఆయన వెల్లడించారు.

bowenpally lake cleaning by hmda
జోరుగా బోయిన్​చెరువులో గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియ

By

Published : Sep 4, 2020, 6:18 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఓల్డ్​ బోయిన్​పల్లి డివిజన్​ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ నరసింహ యాదవ్​ తెలిపారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డివిజన్​లో ప్రధానంగా ఉన్న బోయిన్​ చెరువు గుర్రపు డెక్క సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్రపు డెక్కను తొలగించేందుకు యంత్రాలతో శుద్ధి చేస్తూ చెరువును మినీ ట్యాంక్​బండ్​గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో వ్యాధి లక్షణాలు ఉన్నవారు డివిజన్​లోని ప్రాథమిక వైద్యకేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని కార్పొరేటర్ తెలిపారు. వర్షాకాలం ప్రభావం వల్ల కొన్ని చోట్ల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని.. వాటిని వీలైనంత త్వరగా మరమ్మతులు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ లభించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండిః'రెవెన్యూ చట్టాన్ని మార్చకపోతే పేదలకు ఆకలిచావులు తప్పవు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details