మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. కొవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో అనేక మంది ప్రజలు, తలసేమియా రోగుల ప్రాణాలు కాపాడేందుకు దాతలు చేసిన కృషికి సీపీ ప్రశంసించారు. ప్రతి దాత మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని సీపీ చెప్పారు.
రాచకొండ పోలీసుల రక్తదాన శిబిరం.. 101 మంది ఔదార్యం.. - Blood Donation Camp at Medipally PS
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని సీపీ మహేశ్‌భగవత్ ప్రారంభించగా.. ఇప్పటివరకు 101 మంది దాతలు రక్తదానం చేశారు.
![రాచకొండ పోలీసుల రక్తదాన శిబిరం.. 101 మంది ఔదార్యం.. blood donation camp started by cp mahesh bhagavat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8365692-509-8365692-1597055488130.jpg)
మేడిపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు
ఆపదలో ఉన్న వారిని అదుకోనేందుకు రక్తదానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. రాబోయే రోజుల్లో తమ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఈ శిబిరాలు ప్రారంభిస్తామని సీపీ తెలిపారు. శిబిరాలను నిర్వహించినందుకు రెడ్‌క్రాస్‌కు చెందిన వైద్యుడు పిచ్చిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు 101 మంది దాతలు రక్తదానం చేశారని సీపీ వెల్లడించారు.