కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా దాదాపు 200 మందికిపైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం
ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
అనంతరం ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే మాధవం కృష్ణారావు కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కార్పొరేటర్ ఆకాంక్షించారు. యువత స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ మేడ్చల్-మల్కాజిగిరి ఛైర్మన్ రాజేశ్వర్ రావు, సిబ్బంది, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నరేందర్ గౌడ్, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ కర్రే జంగయ్య, మాజీ కౌన్సిలర్ కర్రే లావణ్య, కూకట్పల్లి నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ ఇజాజ్, డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్ మజ్జి, కౌన్సిలర్ మక్కల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు