తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు శాఖ ఆధ్వర్యంలో వందమంది యువకుల రక్తదానం - రక్తదానం

మేడ్చల్​ జిల్లా పేట్​బషీరాబాద్​లో తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. వారితోపాటు పోలీసులు కూడా పాల్గొన్నారు.

blood donation camp in medchal district
తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదాన కార్యక్రమం

By

Published : Jun 23, 2020, 5:44 PM IST

పేట్​బషీరాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్ధుల కోసం పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మేడ్చల్​ జిల్లా పేట్​బషీరాబాద్​లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 100 మందికి పైగా యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.

వారితోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి పోలీసులు ప్రోత్సాహక ధ్రువపత్రాలు అందజేశారు.

ఇవీ చూడండి: రైతును రాజును చేయడమే కేసీఆర్ లక్ష్యం: మంత్రులు

ABOUT THE AUTHOR

...view details